‘సుధామ’ అనగా, (‘సు ధామ’=) గొప్ప ధామము / మంచి ధామము -- అనగా, "గొప్ప స్థానము". ఈ శతకమున మకుటము ‘సుధామా’గ సాగును. ప్రతి పద్యము 'సుధామా' అని అంతమగు కంద పద్యము!
భవసాగరమును దాట జాలక తమకు తోచిన కష్టములను, దుఖములను తొలగింప వలసినదిగా భగవంతుని కోరుకొను ప్రపత్తి మార్గచరులు, తమ శరీరమును వవిధ పద్ధతులలో కృశింపచేయుట ద్వారా, లేక తమ శ్వాసను నియంత్రించుట ద్వారా తమ మనసును కట్టడిచేయు యోగ మార్గచరులు, లోకములోని వవిధ భాగ్యములను అనుభవించి తనివి తీర్చుకొనదలచు భోగ మార్గచరులు, శాస్త్రములను పరిశ...
71. సృష్టిఁగల మేటి సొత్తు - స
మష్టిగఁ బంచేంద్రియముల మాయఁదగులకే
ేేేస్పష్టమగు పరమ హృత్సం
తుష్టిని - మోక్షానుభూతి - తొడరు సుధామా!
సృష్టిన్ + కల మేటి సొత్తు = ఈ సృష్టిలోని విలువగల ధనమైన; మోక్ష + అనుభూతి = పరమాత్మానంద అనుభవము; సమష్టిగన్ = ఉమ్మడిగా; పంచ + ఇంద్రియముల = కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము అను 5 ఇంద్రియముల; మాయన్ + తగులకే = మాయకు చిక్కుకొని పోక; స్పష్టము + అగు = సువ్యక్తమగు; పరమ హృత్ + సంతుష్టినిన్ = పరమమునకు చేర్పబడిన హృదయము యొక్క సంతుష్టిచే; తొడరున్ = కలుగ...