Add to Book Shelf
Flag as Inappropriate
Email this Book

Sudhaamaa Satakamu

By Arunachala Sastry, Bharatam

Click here to view

Book Id: WPLBN0003575471
Format Type: PDF eBook:
File Size: 2.18 MB
Reproduction Date: 5/4/2015

Title: Sudhaamaa Satakamu  
Author: Arunachala Sastry, Bharatam
Volume:
Language: Telugu
Subject: Non Fiction, Philosophy, Telugu Sataka Padyamulu
Collections: Authors Community, Literature
Historic
Publication Date:
2015
Publisher: Bharatam Arunachala Sastry
Member Page: P V S Kumar

Citation

APA MLA Chicago

Arunachala Sastry, B. B. (2015). Sudhaamaa Satakamu. Retrieved from http://gutenberg.cc/


Description
‘సుధామ’ అనగా, (‘సు ధామ’=) గొప్ప ధామము / మంచి ధామము -- అనగా, "గొప్ప స్థానము". ఈ శతకమున మకుటము ‘సుధామా’గ సాగును. ప్రతి పద్యము 'సుధామా' అని అంతమగు కంద పద్యము! భవసాగరమును దాట జాలక తమకు తోచిన కష్టములను, దుఖములను తొలగింప వలసినదిగా భగవంతుని కోరుకొను ప్రపత్తి మార్గచరులు, తమ శరీరమును వవిధ పద్ధతులలో కృశింపచేయుట ద్వారా, లేక తమ శ్వాసను నియంత్రించుట ద్వారా తమ మనసును కట్టడిచేయు యోగ మార్గచరులు, లోకములోని వవిధ భాగ్యములను అనుభవించి తనివి తీర్చుకొనదలచు భోగ మార్గచరులు, శాస్త్రములను పరిశోధించి ప్రజోపయోగ కార్యములు చేయదలచు శాస్త్రజ్ఞులు ఇత్యాదులు చేరుకొనదలచు సాథనమే ఈ సుధామము.

Summary
ఈ ప్రపంచములో తారసపడు ప్రతివ్యక్తికీ, ప్రతి జీవీ ప్రమాత్మ తత్త్వమే. పరమాత్మము లేని తావు లేదు. ఆ పరమాత్మను ఆధారముగా చేసుకొని ఈ సంసారమున్నది కానీ, ఈ సంసారమును ఆధారముగా చేసికొని పరమాత్మము ఉండదు! ఈ సత్యమును తెలియబరుప లేకపోవుట చేత, ఈ సంసారము అసత్యమగుచున్నది. అదియే మాయ. గోచరించు సంసారంతయూ మాయయే, భ్రాంతియే. అట్టి భ్రాంతియందు దేనికై వెదకిననూ అది అజ్ఞానమునకు దోహదపదగలదు, కానీ, మాయను నశింపచేయు పరమాత్మ తత్వమును అనుభవింపచేయ జాలదు! వైరాగ్యమును, భక్తిని కలబోసి చక్కని పడజాలముతో చక్కని భావములతో రచన గావిమ్పబడిన ఈ శతకము సర్వ జనులకు ఆనందదాయకముగాను, ఆచరణ యోగ్యముగాను ఉండగాలదనడంలో సందేహము లేదు!

Excerpt
71. సృష్టిఁగల మేటి సొత్తు - స మష్టిగఁ బంచేంద్రియముల మాయఁదగులకే ేేేస్పష్టమగు పరమ హృత్సం తుష్టిని - మోక్షానుభూతి - తొడరు సుధామా! సృష్టిన్ + కల మేటి సొత్తు = ఈ సృష్టిలోని విలువగల ధనమైన; మోక్ష + అనుభూతి = పరమాత్మానంద అనుభవము; సమష్టిగన్ = ఉమ్మడిగా; పంచ + ఇంద్రియముల = కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము అను 5 ఇంద్రియముల; మాయన్ + తగులకే = మాయకు చిక్కుకొని పోక; స్పష్టము + అగు = సువ్యక్తమగు; పరమ హృత్ + సంతుష్టినిన్ = పరమమునకు చేర్పబడిన హృదయము యొక్క సంతుష్టిచే; తొడరున్ = కలుగును. ఓ సుధామా! ఇంద్రియముల (కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము – అను పంచేంద్రియముల) మాయకు అందక కేవలమూ పరమాత్మను హృదయమందు కనుగొనుటచే తృప్తిచెందిన వాని ప్రత్యక్షజ్ఞానము వలన – ఈ సృష్టిలోని గొప్ప సొత్తు అయిన మోక్షము లభించును సుమా!

 
 



Copyright © World Library Foundation. All rights reserved. eBooks from Project Gutenberg are sponsored by the World Library Foundation,
a 501c(4) Member's Support Non-Profit Organization, and is NOT affiliated with any governmental agency or department.