Add to Book Shelf
Flag as Inappropriate
Email this Book

దశావతార స్తోత్రములు (Dasãvatãra Hymns)

By Raghava, Kosuri

Click here to view

Book Id: WPLBN0100302135
Format Type: MP3 eBook:
File Size: 10.61 MB
Reproduction Date: 11/18/2019

Title: దశావతార స్తోత్రములు (Dasãvatãra Hymns)  
Author: Raghava, Kosuri
Volume:
Language: Telugu
Subject: Hindu hymns, Hindu epics, Religion and spirituality, Telugu poetry, Dasavatara, Vishnu, Rama, Krishna, , Audio books, Telugu audio, Telugu stotras, స్తోత్రములు,, In praise of Lord Vishnu's ten incarnations (avatãrs)
Collections: Audio Books Collection
Historic
Publication Date:
2019
Publisher: BS Murthy
Member Page: BS Murthy

Citation

APA MLA Chicago

కోసూరి రాఘవ, గాత్రం - వడ్లమాని కామేశ్వరరావ, B. ర. (2019). దశావతార స్తోత్రములు (Dasãvatãra Hymns). Retrieved from http://gutenberg.cc/


Description
Dasavataralu (ten avatars) are the ten earthly incarnations of Lord Vishnu, the Supreme Hindu Deity - first as Matsya the fish, followed by Koorma the tortoise, Varaaha the swine, and later, symbolizing human evolution, the avatars were Narasimha the half man-half lion followed by Vamana the pygmean, Parasurama the intemperate man, Sri Rama the principled man, Sri Krishna the pragmatic man, Buddha the enlightened man, and finally ‘the yet to come’ Kalki the destroyer.

Summary
Vadlamani Kameswara Rao’s audio rendition of Kosuri Raghava's ‘Dasaavataara stotramulu’, penned in Telugu, based on the traditional diction that has been handed down from generation to generation in Konaseema, Andhra Pradesh, aims at preserving the same for future generations.

Excerpt
రామా ! నీ మహిమలెన్న తరమా! బ్రహ్మాదుల కైనా ! రామా ! నీ మహిమలెన్న తరమా! సనకాదుల కైనా! 1 వచ్చి వారధిని జొచ్చి సోమకుని హెచ్చు శరంబుల గృచ్చి సుతులగొని ఇచ్చతొ వేగమె - తెచ్చి విధాతకు హెచ్చరికతొ నివు ఇచ్చి ఏలితివి మత్స్యావతారా జై మత్స్యావతారా. రామా ! నీ మహిమలెన్న తరమా! బ్రహ్మాదుల కైనా ! 2 సురలు శరణుయని సోంపుతొ వేడగ కరుణతో మందర గిరిపృష్ఠమునను గురుతుగ నిడుకొని - వరదేవతలను నిరుపమానముగ - నీవు బ్రోచితివి కూర్మావతార జై కూర్మావతార. రామా ! నీ మహిమలెన్న తరమా! బ్రహ్మాదుల కైనా ! 3 మనమున లేశము కరుణ లేకయా కనకాక్షుడు భువి కలసి చుట్టగను సనకసనందన మునులు వేడగను దనుజుని చుట్టియు ధర ఏలితవౌ వరాహావతారా జై వరాహావతారా. రామా ! నీ మహిమలెన్న తరమా! బ్రహ్మాదుల కైనా ! 4 పరి పరి విధముల ప్రహ్లాదుడు నిను హరి హరి యనుచును మొరలిడగా విని కరమున హిరణ్య కశిపు వక్షమున వరనఖములచే వ్రక్కలు చేసిన నరసింహావతారా జై నరసింహావతారా. రామా ! నీ మహిమలెన్న తరమా! బ్రహ్మాదుల కైనా ! 5 ముదముతొ బలి మూడడుగుల దానము సదయుడవని సంతృప్తిగ నొసగిన వదలక దైత్యుని వడి వేగంబున పదముల నణచిన పరాక్రముడవౌ వామ్నావతార జై వామ్నావతార రామా ! నీ మహిమలెన్న తరమా! బ్రహ్మాదుల కైనా ! 6 కరుణ లేక నివు ..కడు శైర్యముతో వరాయుధంబున - వసుధాస్థలిపై ఇరువదియున్నొక మారు భూపతుల శిరములు కూలగ శరముల నేసిన రామావతారా పరశురామావతారా. రామా ! నీ మహిమలెన్న తరమా! బ్రహ్మాదుల కైనా ! 7 దేవర బ్రహ్మేంద్రాదులు బెబ్బున కావు మనగ కౌసల్య పుత్రయా రావణ మొదలగు రాక్షస సంతతి జీవ మడంచి విభీషను బ్రోచిన రామావతారా జై శ్రీరామావతారా. రామా ! నీ మహిమలెన్న తరమా! బ్రహ్మాదుల కైనా ! 8 కన్నెల చీరలు అన్నియు దొంగిలి చెన్ను మీరగను పొన్న గున్నపై వెన్న దొంగయా చిన్ని కృష్ణునికి అన్నవు కదరా ఎన్నిక హలధర రామావతారా బలరామావతారా. రామా ! నీ మహిమలెన్న తరమా! బ్రహ్మాదుల కైనా ! 9 హద్దు మీరకను హరి నీ సేవయు వొద్దిక తోడను .. వెదకి సేయ పరి- శుధ్ద జనుల నివు సూటిగ కనుగొని సద్దు సేయగను సరగున బ్రోచిన బౌధ్ధావతారా జై బౌధ్ధావతారా. రామా ! నీ మహిమలెన్న తరమా! బ్రహ్మాదుల కైనా ! 10 ఇల సుజనుల నివు ఇంపుతొ గనుగొని ఖలులను కనుగొని ఖండించుటకును జలజనయనయీ కలియుగాంతమున కలికి మూర్తివై కలిగెదవౌరా కల్కావతార జై కల్కావతార రామా ! నీ మహిమలెన్న తరమా! బ్రహ్మాదుల కైనా ! వాసిగ ఇరగవ రాధీశుడవై కేశవ నీ కృప - లేశము మరువక భాసురముగ - కోసూరి రాఘవ దాసుని హృదయ - నివాసుడ వైతివి దాసావతారా జై జై దాసావతారా. రామా ! నీ మహిమలెన్న తరమా! బ్రహ్మాదుల కైనా ! కోనసీమలో ఈ 'కోసూరి రాఘవ' విరచిత దశావతార స్తోత్రములు షుమారు వంద సంవత్సరాలకు పైగా ప్రాచుర్యం లో వున్నాయి. వీటిని స్తోత్రించే విధానo 'వడ్లమాని కామేశ్వర రావు' స్వరంలో ఇచట పొందుపరచబడింది

 
 



Copyright © World Library Foundation. All rights reserved. eBooks from Project Gutenberg are sponsored by the World Library Foundation,
a 501c(4) Member's Support Non-Profit Organization, and is NOT affiliated with any governmental agency or department.